నల్గొండ,అక్టోబర్ 4. అర్. టి. సి సమ్మె కారణం గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను కోరారు.ఈ రోజు జిల్లా కలెక్టర్ లు,పోలీస్ సూపరింటెండెంట్ లు,రవాణా శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమ్మె నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.తాత్కాలికంగా డ్రైవర్లను,కండక్టర్ లను నియామకం చేసుకోవాలని,ప్రైవేట్,స్కూల్ బస్ లను వినియోగించుకోవాలని అందుకు గాను ఆన్లైన్ అనుమతులు ఇవ్వాలని కోరారు.రెవెన్యూ,పోలీస్,రవాణా శాఖ అధికారుల సమన్వయంతో అర్.టి.సి.అధికారులు సమ్మె ప్రభావం ప్రయానికులపై పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని,కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని తెలిపారు.
రాష్ట్ర డి.జి.పి మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు.అర్.టి.సి.పోలీస్ రవాణా శాఖ అధికారులు ఒక స్ట్రాటజీ ప్రకారం పనిచేసి ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని,అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు.
అర్. టి. సి సమ్మె కారణం గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి - మంత్రి పువ్వాడ అజయ్